గూడూరు ఎస్కేఆర్ కళాశాలలో ఎమ్మెల్యే సునీల్ సమీక్ష

గూడూరులోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలపై ఇటీవల వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే సునీల్ సోమవారం కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది, విద్యార్థులతో సమావేశమై సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ కళాశాలకు ఎటువంటి అపకీర్తి తీసుకురావద్దని ఆయన కోరారు. కళాశాలలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్