నిమ్మ రైతులకు ఊరటనిచ్చిన ధరలు.. కిలో రూ. 200 పలికిన మార్కెట్

రాష్ట్రంలో నిమ్మ మార్కెట్‌కు ప్రసిద్ధి చెందిన గూడూరు, అభివృద్ధి చెందుతున్న బాలాయపల్లి మండలం జయంపు మార్కెట్లలో ఆదివారం నాణ్యమైన నిమ్మకాయలు కిలో రూ. 200 ధర పలికాయి. దీంతో రైతులకు కొంత ఊరట లభించింది. గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాల్లో సుమారు 70 వేల ఎకరాల్లో నిమ్మ సాగు జరుగుతోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రూ. 120 నుంచి రూ. 180 వరకు నిలకడగా ఉన్న ధరలు, తాజాగా రూ. 200కు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్