గూడూరును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గాంధీబొమ్మ సెంటర్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం 175వ రోజుకు చేరుకున్నాయి. భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల్ నాయుడు మాట్లాడుతూ, అన్ని వసతులు, పరిపాలనా సామర్థ్యం, వనరులు ఉన్న గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గౌరవించాలని, పట్టణ ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ఉద్యమానికి మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.