ఓజిలి మండలంలోని రాజుపాలెం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుండి నెల్లూరుకు వెళ్తున్న కారు, రోడ్డు దాటుతున్న రాజుపాలెంకు చెందిన వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తలపై తీవ్రగాయమైంది. హైవే అంబులెన్స్ సిబ్బంది అతన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.