గూడూరులో పెంచలయ్య హత్య పై తీవ్ర నిరసన

నెల్లూరు జిల్లా గూడూరులో గంజాయి ముఠా దాడిలో మృతి చెందిన పెంచలయ్య హత్యను నిరసిస్తూ పలు ప్రజా సంఘాలు మంగళవారం ఆందోళన చేపట్టాయి. సీపీఎం, సీఐటీయూ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, గూడూరు పరిసరాల్లో గంజాయి వ్యాపారాన్ని అరికట్టడానికి, యువతను మాదకద్రవ్యాల బానిసత్వం నుండి కాపాడటానికి పెంచలయ్య కృషి చేస్తున్నందునే అతనిపై దాడి చేసి హత్య చేశారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్