గూడూరులో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు

గూడూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్