కుప్పంలోని పలు ప్రాంతాలలో రీఛార్జ్ అవుతున్న బోర్లు

గత ఐదేళ్లుగా నీరు లేక బీడుగా ఉన్న భూములకు హద్రినీవా కాలువ ద్వారా నీరందించడంతో చెరువులు నిండుతున్నాయని, బోర్లు రీఛార్జ్ అవుతున్నాయని స్థానిక నాయకులు, రైతులు శనివారం తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని బైరు గాని పల్లిలో రవిచంద్ర బాబు అనే రైతు తన బోరులో మోటర్ బిగించగా పుష్కలంగా నీరు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తయిందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్