చిత్తూరు: మహిళా ఆత్మహత్య UPDATE

చిత్తూరు జిల్లా కుప్పంలో మంగళవారం ఉదయం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ప్రైవేట్ టీచర్ గాయత్రి అని గతంలోనూ కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఆరు నెలల క్రితం రైలు కింద పడి చనిపోతానని వీడియో కాల్ చేయగా తోటి టీచర్లు అప్రమత్తమై ఆమెను కాపాడారు. 13 ఏళ్ల క్రితం యువరాజుతో ప్రేమ వివాహం చేసుకోగా ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగా ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది.

సంబంధిత పోస్ట్