చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలోని శాంతి పురం మోడల్ పాఠశాలలో ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు నీట్, ఈఏపి సెట్ కోచింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వినయ్ కుమార్ బుధవారం తెలిపారు. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన 100 మంది విద్యార్థినులకు మాత్రమే ఈ కోచింగ్ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.