కుప్పం నియోజకవర్గంలో, గుడిపల్లి మండలం, పొగరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అడిడాస్‌తో పాటు ఆరు పరిశ్రమల ఏర్పాటుకు స్వచ్ఛందంగా భూములు అందించిన 202 మంది రైతులకు సోమవారం ప్రభుత్వం రూ. 63 కోట్ల పరిహారం చెక్కులను అందజేసింది. రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, భూములకు తగిన గౌరవం, సముచిత పరిహారం అందించడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, సీనియర్ నాయకులు సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.