రామకుప్పం మండలంలో ఏనుగుల స్వైర విహారం

కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు రైతుల పంటలను ధ్వంసం చేసి అపార నష్టం కలిగిస్తోంది. తమిళనాడు వైపు నుంచి వచ్చిన పది ఏనుగులు గత వారం రోజులుగా 89 పెద్దూరు, ననియాల తండా ప్రాంతాల్లో తిరుగుతూ రాత్రి సమయంలో పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. వరి, కొబ్బరి, అరటి, టమోటా వంటి పంటలు ధ్వంసం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్