శాంతిపురం మండలంలో కట్టెల ట్రాక్టర్ బోల్తా

కుప్పం నియోజకవర్గం, కుప్పం-పలమనేరు హైవే పై శాంతిపురం మండలంలోని ఏడో మైలు మలుపు వద్ద గురువారం కట్టెల ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల వివరాలు మేరకు  ట్రాక్టర్ ఏడవ మైలు క్రాస్ నుంచి రాళ్ల బూదుగూరు వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది . ట్రాక్టర్ బోల్తా పడిన సమయంలో చుట్టుపక్కల ఎలాంటి వాహనాలు, ప్రజలు  లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్