AP CM చంద్రబాబుపై వివాదాస్పద పోస్టులు పెట్టిన కేసులో మాజీ CM జగన్ మాజీ CPRO పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు మరోసారి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన్ను అరెస్ట్ చేయగా రిమాండ్‌కు నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఉత్తర్వులిచ్చింది. పోలీసులు HCకు వెళ్లగా వాటిని సస్పెండ్ చేసింది. HC ఉత్తర్వులపై శ్రీహరి SCకు వెళ్లగా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలంది. ఈ నేపథ్యంలో కుప్పం పోలీసులు తదుపరి చర్యలకు దిగారు.