గుడిపల్లి: రాష్ట్రస్థాయి పోటీలకు ఉన్నత పాఠశాల విద్యార్థులు

కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలంలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల శెట్టిపల్లికు చెందిన విద్యార్థినులు ఎం. భవ్యశ్రీ, ఆర్. సంధ్య, టీ. జయప్రద రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్టుకు ఎంపికయ్యారు. ఈ మూడు ప్రాజెక్టులకు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు జె. లలిత సుభాషిని మార్గదర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శనివారం హెచ్ఎం. కె. కుమార్ బాబు, ఎంఈవోలు శ్రీదేవి, లక్ష్మయ్యతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్