కుప్పం: పేకాట ఆడుతున్న 5 మంది అరెస్ట్

రామకుప్పం మండల పరిధిలోని చెల్దిగానిపల్లి సమీపంలో పేకాట స్థావరాలపై కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 5 మందిని అరెస్టు చేసినట్లు సిఐ మల్లేష్ యాదవ్ స్పష్టం చేశారు. వారి వద్ద నుండి రూ. 16, 300 నగదును స్వాధీనం చేసుకొన్నామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐలు వెంకట మోహన్, శ్రీనివాసులు, నరేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్