కుప్పం మండల పరిధిలోని చెక్కునత్తంలోని రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం 'రైతన్న మీకోసం, అన్నదాత సుఖీభవ' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాంబశివం, కడ పొలిటికల్ సభ్యులు రామచంద్ర, కార్పొరేషన్ డైరెక్టర్లు చెక్కునత్తం మణి, శరవణ, మండల యువత అధ్యక్షులు కనకరాజు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.