కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో ఉన్న అన్న క్యాంటీన్‌కు కుప్పం గంగమ్మ గుడి ఛైర్మన్ బీఎంకే రవి చంద్రబాబు ఆదివారం రూ. 30 వేల విలువైన మినరల్ వాటర్ ప్యూరిఫైయర్‌ను నిర్వాహకులకు అందజేశారు. అన్న క్యాంటీన్‌లో భోజనం చేసే పేదలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే ఈ వితరణ ఉద్దేశ్యమని రవి చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో మండలంలో పేదలకు అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరితగతిన అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.