కుప్పం: పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం

చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, కంగుంది పంచాయతీ పరిధిలో ఏనుగుల దాడుల వల్ల పంట నష్టపోయిన ఎనిమిది మంది రైతులకు బుధవారం రూ. 1,27,800 నష్టపరిహారం చెక్కులను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున అందజేశారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, అటవీ శాఖ అధికారులతో కలిసి ఈ చెక్కులను రైతులకు అందించారు. ఏనుగుల దాడులను నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు అధికారుల సూచనలను పాటించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్