రామకుప్పం మండలంలోని ననియాల పరిసరాల్లో గత 10 రోజులుగా రాత్రిపూట తిరుగుతున్న ఒంటరి ఏనుగు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏనుగు దాడిలో వరి, టమాటా పంటలతో పాటు వ్యవసాయ పరికరాలు ధ్వంసమై అన్నదాతలకు అపార నష్టం వాటిల్లుతోంది. ఒంటరి ఏనుగును నియంత్రించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.