కుప్పం ఇంజినీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్, గురువారం కేంద్ర నైపుణ్యాభివృద్ధి & ఉపాధి శాఖ మంత్రి మరియు విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై దృష్టి సారించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. విద్యారంగంలో 25 సంవత్సరాల సేవలు పూర్తి చేసుకున్నందుకు కళాశాలను మంత్రి అభినందించారు. అలాగే (PMKVY) దశ–1, దశ–2లను విజయవంతంగా అమలు చేసినందుకు కళాశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు. దేశంలో నైపుణ్యాధారిత విద్యను మరింత బలోపేతం చేయడం, యువతను ప్రోత్సహించడం దిశగా ఈ భేటీ కీలకంగా నిలిచిందని డా. సునీల్ రాజ్ తెలిపారు.