కుప్పం మండలంలోని నాయనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కేసి హాస్పిటల్ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా, పంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం ఎలాగో పిల్లలకు వివరించారు. అనంతరం, వారికి ఉచితంగా టూత్‌పేస్ట్, బ్రష్ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భవ్య, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.