గుడిపల్లి మండలంలోని కనుమనపల్లి పంచాయతీ మిద్దూరుకు చెందిన పద్మ, అన్నామలై దంపతులపై పద్మ సోదరుడు శ్రీనివాసులు కత్తితో దాడి చేశాడు. బుధవారం జరిగిన ఈ ఘటనలో, పుట్టింటివారు ఇచ్చిన భూమిని తనకివ్వాలని శ్రీనివాసులు గొడవపడగా, ఈ దాడి జరిగినట్లు బాధితులు తెలిపారు. గాయపడిన దంపతులను చికిత్స కోసం కుప్పం ఆసుపత్రికి తరలించారు.