అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు కుప్పం డి. ఎస్. పి పార్థసారథి సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, కుప్పం రూరల్ సర్కిల్ పరిధిలో 4 నాలుగు ఇళ్లల్లో శక్తి వేలు అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 1 కేజీ వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుడి పై పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు.