కుప్పం: జాతీయ అవార్డుకు కుప్పం ఎన్నిక

పంచాయతీ పాలనలో కుప్పం బ్లాక్ ఉత్తమంగా నిలిచి జాతీయ అవార్డుకు ఎంపికైందని డీపీఓ సుధాకర్ రావు మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కేంద్ర బృందం కుప్పం మండలం, నాయనూరు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, అభివృద్ధి వంటి అంశాలను పరిశీలించి, ఆ ప్రాంతంలో సేవలు మెరుగ్గా ఉండటంతో ఆ పంచాయతీతో పాటు కుప్పం మండలాన్ని ఒక బ్లాక్‌గా నిర్ణయించి జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈనెల 24న ఢిల్లీలో అవార్డు అందుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్