ప్రభుత్వ ఆదేశాల మేరకు కుప్పం మునిసిపల్ పరిధిలో గల మోడల్ కాలనీలో శ్రీ సాయి బాబా పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని పాఠశాల కర్రస్పాండెంట్ రవికుమార్ తెలిపారు. ఈ సమావేశానికి మునిసిపల్ అధికారి సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు సోముశేఖర్, హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను వివరించారు, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలన్నారు.