కుప్పం మండలంలోని నూలుకుంట గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త వెంకటేష్ కుటుంబానికి టీడీపీ సభ్యత్వ భీమా ద్వారా రూ. 5 లక్షల చెక్కును ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపిఐఐసి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకటేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ భరోసా ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.