ప్రజల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సోమవారం పేదల కోసం గృహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, రాళ్లబుదుగూరులో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలనే సంకల్పంతో చేపట్టిన అభివృద్ధి పథకాలలో ఇది ఒక గొప్ప పథకమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.