కుప్పం కోర్టు న్యాయవాదుల సంఘ సభ్యులు మరియు సీనియర్ న్యాయవాదుల మీద నకిలీ న్యాయవాది చేసిన దాడికి నిరసనగా శుక్రవారం నగరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు, వేలాయుధం మరియు కార్యదర్శి, జాన్ జోష్ ల ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా పోలీసు శాఖ తగు చర్యలు చేపట్టాలని కోరారు.