కుప్పం నారాయణ విద్యార్థుల ప్రతిభ, పలు విభాగాల్లో విజేతలు

చంద్రగిరి సమీపంలోని SMPS బాయ్స్ క్యాంపస్‌లో జరిగిన NPL (నేషనల్ ప్రీమియర్ లీగ్) క్రీడా పోటీలలో కుప్పం నారాయణ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో, విద్యార్థులు తమ శ్రద్ధ, పట్టుదల, కృషితో అందరినీ ఆకట్టుకున్నారు. క్రీడా రంగంలో విద్యార్థులు సాధించిన ఈ విజయాలు వారిలోని స్ఫూర్తికి నిదర్శనమని పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్