చిత్తూరు జిల్లా, కుప్పం మండలంలోని వేపూరు, వానగుట్టపల్లిలో బెల్ట్ షాపులపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. పలు చిల్లర దుకాణాల్లో మద్యం అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేసి, 58 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక పనులకు శిక్ష తప్పదని ఎస్సై బాబు హెచ్చరించారు.