చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలోని రాళ్లబుదూగూరులో నూతన తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ బుధవారం పూజ చేసి పనులు ప్రారంభించారు. రాళ్లబుదుగూరు గ్రామం మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు సుమారు 9. 5 కిలోమీటర్ల మేర రూ. 4. 5 కోట్ల వ్యయంతో తారు రోడ్డుకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.