కుప్పం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలి

కుప్పంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి నేతలు చేపట్టిన సంతకాల సేకరణలో భాగంగా, బుధవారం వైసిపి జిల్లా పార్టీ కార్యాలయానికి సంతకాల పత్రాలను తరలించారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గంలో 63,000 మంది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్