కుప్పం: ర్యాలీని విజయవంతం చేయాలి: భరత్

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న చేపట్టనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని MLC భరత్ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఆదివారం కుప్పంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన, ప్రైవేటీకరణతో కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్