కుప్పం ప్రాంతంలో ఏర్పాటు కానున్న వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించాలని ఏపీఐఐసి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ మంగళవారం కోరారు. సీఎం చంద్రబాబు చొరవతో కుప్పంలో పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని, ఈ నేపథ్యంలో ఉద్యోగావకాశాలపై యువతకు మరింత అవగాహన అవసరమని ఆయన కడా పీడీ వికాస్ మర్మత్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.