రామకుప్పం మండలం, ననియాల తండా గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం రాత్రి నిర్వహించిన గ్రామ సభలో, అడవి జంతువుల వల్ల పంటలు నష్టపోతున్నామని, భయంతో జీవిస్తున్నామని ప్రజలు తెలిపారు. అడవి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.