కుప్పం పట్టణంలోని డీసీసీబీ బ్యాంకుకు ఛైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి బుధవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు జాకీర్, జిమ్ దాము, పార్టీ విస్తరణ కమిటీ సభ్యులు మంజునాథ్, మాజీ ఎంపీటీసీ ఉమాపతి, మాజి వార్డ్ మెంబర్ నాను సన్మానించారు. బ్యాంకు అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.