కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్సుల చెల్లింపుల కోసం గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఫోన్ కాల్స్ నకిలీవని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. వ్యాపారులు ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ పేమెంట్ చేయమని మున్సిపల్ సిబ్బంది ఎవరూ ఫోన్ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రేడ్ లైసెన్స్ చెల్లింపుల కోసం వ్యాపారులు నేరుగా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.