కుప్పం: పొలంలో గడ్డి కోస్తుండగా బాలికపై అడవి పంది దాడి

కుప్పం మండలం మిట్టపల్లి సమీపంలో అడవి పంది దాడి చేసిన ఘటన కలకలం రేపింది. దండపాణి కుమార్తె మీనాక్షి మంగళవారం పొలంలో గడ్డి కోస్తుండగా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన అడవి పందిని కుక్కలు వెంబడించడంతో అది మీనాక్షిపై దాడి చేసింది. కాలు కొరకడంతో తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్