కుప్పం మండలంలోని చెక్కునత్తం పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు గురువారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, పికేఎం- ఉడా ఛైర్మన్ డా. సురేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టి కుప్పం అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్ పిలుపునిచ్చారు.