కుప్పం మున్సిపాలిటీలోని తంబిగాని పల్లికి చెందిన వైసీపీ నాయకులు వేలాయుధం, తిరుమల సహా ఏడుగురు సోమవారం ఎమ్మెల్సీ శ్రీకాంత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్, టీడీపీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.