రామకుప్పం మండలం, శనివారం పీఎం తాండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నాయక్ అందజేశారు. గౌరవప్రదంగా జీవించడానికి, పేదల సేవలో ఈ పెన్షన్లు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గ్రామంలో 4000, 6000, 15000 రూపాయల వరకు పెన్షన్లు అందజేస్తూ, ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది నీరజాక్షులు, చంద్రబాబు నాయక్, మురళి నాయక్, మోహన్ నాయక్, పెన్షన్దారులు పాల్గొన్నారు.