తమిళనాడు రాష్ట్రం వాణియంబాడికి చెందిన శివకుమార్‌ను కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. రామకుప్పం ఎస్‌ఐ వెంకట మోహన్ తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం మిట్టపల్లిలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఆటోలో మద్యం తీసుకెళ్తుండగా శివకుమార్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఎస్‌ఐ సోమవారం తెలిపారు.