కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ అభివృద్ధి: హరి ప్రసాద్

రాష్ట్ర హస్తకళ అభివృద్ధి ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఆయన కుప్పం, గుడిపల్లి మండలాల్లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డా. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం మండలంలోని వేపూరు మిట్టపల్లి, గుడిపల్లి మండలంలోని గుండ్ల సాగరం, యామి గాని పల్లి, కనుమలపల్లి గ్రామాల్లో జనసేన పార్టీ జెండాలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్