శాంతిపురం మండలం రాళ్ళబుదుగురు పంచాయితీ గొల్లపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని పురవీధుల్లో శ్రీరాములవారిని ఊరేగించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం, వాయిద్య బృందంతో తోలుబొమ్మలాటలు, కోలాటాలు నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపను పొందారు.