చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, శాంతీపురం మండల కేంద్రంలో 'వెన్ను పోటుకు 2 సంవత్సరాలు' కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అనంతరం 'జై జగన్ జై జగన్' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వినర్ బుల్లెట్ దండపాణి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.