రామకప్ప మండలంలో ఆగని ఏనుగుల దాడులు

కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో, ననియాల తండా సమీపంలో గత 20 రోజులుగా జంట ఏనుగులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజూ అటవీ ప్రాంతం నుంచి ననియాల ఎలిఫెంట్ క్యాంప్ వద్దకు వచ్చి, అక్కడి నుంచి ఆహారం కోసం వ్యవసాయ పంటలపై దాడి చేస్తున్నాయి. ఈ ఏనుగుల దాడుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఈ ఏడాది పంటలు చేతికి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి, ఏనుగులను దారి మళ్ళించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్