తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట అనుమతి లేకుండా యాడ్స్ వీడియోలు చిత్రీకరించిన హైదరాబాదుకు చెందిన గోలి అనిల్ అనే యువకుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి, బిఎండబ్ల్యు కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 'లక్కీ డ్రా' పేరుతో భక్తులను మోసం చేసి డబ్బులు వసూలు చేయడమే అతని లక్ష్యమని విచారణలో తేలింది. భక్తుల విశ్వాసాలను దుర్వినియోగం చేయవద్దని టీటీడీ అధికారులు హెచ్చరించారు.