మదనపల్లె ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన వాహనాలకు 17న వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ భీమలింగ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సుమారు 200 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఇందులో తొలి విడతగా 60 వాహనాలను వేలం వేయుటకు కడప ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనుమతి ఇచ్చారని తెలిపారు. ఈనెల17 ఉదయం10 గంటలకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వేలం వేయడం జరుగుతుందన్నారు.