మదనపల్లె స్పెషల్ సబ్ జైలును రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. మొదట సబ్ జైల్లో రికార్డులను పరిశీలించారు. ఖైదీల సౌకర్యాలపై నేరుగా బేరక్ ల వద్దకు వెళ్లి ఆరా తీశారు. శిక్ష అనుభవిస్తున్న వారిలో మార్పు తీసుకొచ్చేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ మెనూ ప్రకారం ఖైదీలకు ఆహారం, ఇతర సౌకర్యాలు ఉండాలన్నారు.