మదనపల్లె: గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులకు ఒరిగింది శూన్యం

గత ఐదేళ్ల వైకాపా పాలనలో మామిడి రైతులకు ఒరిగింది శూన్యమని, మామిడి రైతులకు పరామర్శ పేరిట మాజీ సీఎం జగన్ కొత్త నాటకానికి తెరతీశారని టిడిపి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్. జె. వెంకటేష్ ఆరోపించారు. గురువారం నిమ్మనపల్లి సర్కిల్ నందు ఆయన మాట్లాడుతూ బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ విచ్చేశారని, అది పరామర్శలాగా కాకుండా దండయాత్రలాగా ఉందని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్